100 సీట్లలో లూటీ చేసి గెలిచారు..ఎన్నికల కమిషన్ కాదది.. బీజేపీ కమిషన్

100 సీట్లలో లూటీ చేసి గెలిచారు..ఎన్నికల కమిషన్ కాదది.. బీజేపీ కమిషన్
  • బీజేపీది అనైతిక విజయం..  మమత 
  • తాము మళ్లీ పుంజుకుంటామని ధీమా 

కోల్ కతా: బెంగాల్ ఎన్నికల ఫలితాలపై టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లూటీ చేసి ఈ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిపోయిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత సోమవారంరాత్రి మీడియాతో ఆమె మాట్లా డారు. "100కు పైగా సీట్లను బీజేపీ లూటీ చేసింది. ఎన్నికల కమిషన్ అనేది బీజేపీ కమిషన్. నేను సీఓకు, మనోజ్ అగర్వాల్‌‌కు ఫిర్యాదు చేశాను. కానీ వారు ఏమీ చేయడం లేదు" అని ఆమె అన్నారు. "దీనిని మీరు విజయం అని అనుకుంటున్నారా? ఇది అనైతిక విజయం. ఎన్నికల కమిషన్, కేంద్ర బలగాలు, ప్రధాని, కేంద్ర హోంమంత్రితో కలిసి చేసినదంతా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది లూటీ, లూటీ, లూటీ. మేం మళ్లీ పుంజుకుంటాం" అని మమత వ్యాఖ్యానించారు.